బీజేపీ..తెలంగాణకు చేసిందేమిటీ: కడియం

17
kadiyam

బీజేపీ తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏంటీ అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. వరంగల్‌లో చీఫ్ విప్ వినయ్ భాస్కర్,ఎంపీ దయాకర్,ఎమ్మెల్సీ బండ ప్రకాష్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన కడియం…బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్‌లో సభ పెట్టే అర్హత బీజేపీకి లేదని మేడారం జాతరకు జాతీయ హోదా తీసుకురాలేని చవటలు బీజేపీ నాయకులు అని మండిపడ్డారు.

బిడ్డా సంజయ్.. ఇది ఉద్యమాల గడ్డా, టీఆర్ఎస్ గడ్డా, ఖబడ్దార్..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కడియం… కేసీఆర్‌ను విమర్శించే అర్హత సంజయ్‌కు లేదని, మధ్యప్రదేశ్, అస్సాం సీఎంలకు మతి ఉందా..? అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ సీఎంలు, మంత్రులు, నాయకులు సీఎం కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని గతంలో మెచ్చుకున్న వారే ఇప్పుడు దూషిస్తున్నారని, బీజేపీ నాయకులు పగటివేషగాళ్లలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.