- Advertisement -
తనపై బీజేపీ నేత ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు నిరూపించాలని…ఒకవేళ నిజమైతే రాజకీయాల నుండి తప్పుకుంటానని స్పష్టం చేశారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన గంగుల..సానుభూతి కోసమే ఈటల ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈటల వ్యాఖ్యల్లో నిజం లేకుంటే ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలి అని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను భయపెట్టే విధంగా వ్యాఖ్యానించడం సరికాదన్నారు.
తెలంగాణలో భౌతిక దాడులు, హత్యల సంస్కృతి లేదని….ఈటల నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. ఈటలకు ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తోందని చెప్పారు. ఈటల కామెంట్స్‌పై వెంటనే విచారణ జరిపించాలని డీజీపీ కోరుతున్నాను అని మంత్రి గంగుల తెలిపారు. ఈటలకు నమ్మకం లేకపోతే కేంద్ర సంస్థలతోనే విచారణ జరిపించండి అని చెప్పారు.
- Advertisement -