ఉపాసనకి రామ్ చరణ్ స్పెషల్ విషెస్

150
ram charan

తన భార్య ఉపాసన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ విషెస్ తెలిపారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన రామ్ చరణ్‌..అవసరమైన వారికి, మీ కుటుంబానికి బెస్ట్ ఇవ్వడం ఎప్పుడూ ఆపలేదు..నీవు చేస్తున్నదానికి బహుమతి ఇచ్చేందుకు ఏ గిఫ్ట్ సరిపోదు అంటూ ఉపాసనతో కలిసి దిగిన ఓ బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేశారు. రామ్ చరణ్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ఫ్యాన్స్‌ సైతం విషెస్ తెలియజేస్తున్నారు.

2012లో రామ్‌చరణ్‌ – ఉపాసన వివాహం జరిగింది. ఓ వైపు వ్యాపారవేత్తగా,మెగా ఫ్యామిలీ ఇల్లాలుగా రాణిస్తోంది ఉపాసన. ఇక చెర్రీ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్నారు. అక్టోబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది.