- Advertisement -
సోమవారం తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి అధికార నివాసంలో కేసీఆర్‌ను కలిసిన స్పీకర్ బాన్సువాడ నియోజకవర్గంలోని అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించడంతో పాటుగా నూతనంగా మరో 5 వేల డబుల్ బెడ్ రూం ఇళ్ళను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
అదేవిధంగా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని మెట్ట ప్రాంత భూములకు నీరందించడానికి జాకోరా, చందూరు ఎత్తిపోతలు, సిద్దాపూర్ రిజర్వాయర్ మరియు మంజీర నదిపై చెక్ డ్యాంల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసినందుకు స్పీకర్ పోచారం సీఎంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ వెంట ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు.
- Advertisement -