- Advertisement -
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలోని చాలా రాష్ట్రాలు కర్ఫ్యూ బాటపట్టాయి. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ అమలుచేస్తున్నాయి. నిన్న కేరళలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ ప్రారంభమయ్యింది. తాజాగా మరో దక్షిణాది రాష్ట్రంలోనూ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి గోవాలో రాష్ట్రంలో నేటి నుంచి 15 రోజుల పాటు పూర్తి కర్ఫ్యూను విధిస్తూ సీఎం ప్రమోద్ సావంత్ నిర్ణయం తీసుకుంది.
దీంతో రాజధానితోపాటు అన్ని ప్రాంతాల్లో రహదారులు నిర్మాణుష్యంగా మారాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అత్యవసర సేవలతో సంబంధం ఉన్న దుకాణాలను తెరిచే అవకాశం కల్పించారు. అదేవిధంగా రెస్టారెంట్లు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ‘ఫుడ్ హోం డెలివరీ’ చేయనున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 24 వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.
- Advertisement -