పెళ్లిపై చార్మి సంచలన కామెంట్స్‌..!

74
charmee

టాలీవుడ్‌ అందాల భామ చార్మి ఒకప్పుడు హీరోయిన్‌గా తన గ్లామర్‌తో యూత్‌ని అట్రాక్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు నిర్మాతగా మారి వరుస విజయాలతో దూసుకెళ్తుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటోంది. పూరి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభిన ఆమె దాని తాలూకు అన్ని వ్యవహారాలు భుజాలపై వేసుకుంది. ఇలా కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్న చార్మి త్వరలో పెళ్లి చేసుకోతుందని ఇటీవల వార్తలు వినిపించాయి.ఈ వార్త‌ల‌పై చార్మి క్లారిటీ ఇచ్చింది.

త‌న పెళ్లి అంటూ వ‌చ్చిన వార్త‌ల్లో నిజం లేదని, అవన్నీవ‌దంతులేన‌ని ఆమె స్ప‌ష్టం చేసింది. ప్రస్తుతం కెరీర్ హాయిగా సాగిపోతోందని చెప్పింది. ఈ జీవితాన్ని తాను చాలా సంతోషకరంగా గ‌డుపుతున్నాన‌ని తెలిపింది. త‌న‌ జీవితంలో పెళ్లి చేసుకోవడం వంటి తప్పు చేయనని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు, న‌కిలీ రాత‌లు రాసే వారికి, వ‌దంతుల‌కు గుడ్ బై అంటూ ఆమె ట్వీట్ చేసింది. అయితే, ఇటువంటి తప్పుడు స్టోరీలతో అంద‌రినీ ఆక‌ర్షిస్తోన్న వారిని అభినందించవచ్చంటూ చుర‌క‌లంటించింది. చార్మి ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ తో ‘లైగర్‌’ అనే పాన్‌ ఇండియా సినిమాను నిర్మిస్తుంది.