ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించింది తెలంగాణ ఉద్యోగుల సంఘం. నల్లగొండ-వరంగల్-ఖమ్మం, మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఉద్యోగుల కష్టసుఖాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే పీఆర్సీ పై నిర్ణయం తీసునే అవకాశం ఉందని, మంచి పీఆర్సీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యోగులు సీఎం కేసీఆర్ వెన్నంటే ఉన్నారన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం చైర్మన్ పద్మా చారి, ప్రెసిడెంట్ పవన్ కుమార్ గౌడ్, జనరల్ సెక్రటరీ రవీందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ లు శ్రీకాంత్ రావు, సత్య గౌడ్, చిన్నారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ నర్సింగ్ రావు, ఆర్గనైజ్ సెక్రటరీ సురేందర్, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎండీ షరీఫ్, వైస్ ప్రెసిడెంట్ క్రిష్ణ రావు తదితర ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నారు.