బెంగాలీ బిడ్డను..ఆశీర్వదించండి: మమతా

169
mamatha
- Advertisement -

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భాగంగా నందిగ్రామ్ నుండి తృణముల్ చీఫ్ మమతా బెనర్జీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్న దీదీ ఉద్వేగానికి గురయ్యారు. బుధ‌వారం తాను నామినేష‌న్ వేయాల‌నుకుంటున్నాన‌ని, మీరు వ‌ద్దంటే తాను నామినేష‌న్ వేయ‌బోన‌ని చెప్పారు. మీరు న‌న్ను మీ బిడ్డ‌గా ప‌రిగ‌ణించి మ‌రోసారి ఆశీర్వ‌దిస్తామంటేనే నామినేష‌న్ దాఖ‌లు చేస్తాన‌ని ప్ర‌జ‌ల నుంచి హామీ తీసుకున్నారు.

అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీలు హోరాహోరీగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నాయి. బీజేపీ త‌ర‌ఫున ప్ర‌ధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయాధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, రాష్ట్ర అధ్య‌క్షుడు దిలీప్ ఘోష్ ప్ర‌చారాన్ని ఉర‌క‌లెత్తిస్తుండ‌గా.. అధికార తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జి అన్నీ తానై ముందుకు సాగుతున్నారు.

మార్చి 27 నుంచి 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 294 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 2016లో మమత నేతృత్వంలోని తృణమూల్ 211 స్థానాల్లో విజయం సాధించింది. వామపక్షాలు 77 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ కేవలం మూడు చోట్ల మాత్రమే విజయం సాధించింది.

- Advertisement -