కేంద్ర చట్టాలతో రైతులకు నష్టం…

144
errabelli
- Advertisement -

కేంద్ర ప్రభుత్వ చట్టాలు రైతులకు నష్టం కలిగించేలా ఉన్నాయని, వాటిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించకున్న అనంతరం మాట్లాడిన మంత్రులు… అన్నదాతలను సంఘటిత పరిచి.. వారికి కావాల్సిన సదుపాయాలు, మార్కెటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడమే ప్రభుత్వం లక్ష్యం అన్నారు.

రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని…సాగునీరు, విత్తనాలు, 24 గంటల విద్యుత్‌, రైతు వేదికలు, కల్లాలు, అనేక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. కష్టకాలంలో రైతుల పంటలను కొనుగోలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రతి ఏటా రూ.400 కోట్లు రైతాంగ సంక్షేమానికి ఇచ్చేందుకు సీఎం ఆలోచిస్తున్నారన్నారు.

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఎమెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి తదితరులు ఉండగా ఈ సందర్భంగా మంత్రులకు ఆలయ ఈఓ, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం మంత్రులకు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

- Advertisement -