పక్కా కమర్షియల్‌లో బండ్ల గణేశ్…!

158
bandla
- Advertisement -

టాలీవుడ్‌లో చిన్న సినిమాలతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు మారుతి. మొదట్లో యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలను తెరకెక్కిస్తూ వచ్చిన మారుతి, ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. తాజాగా యాక్షన్ హీరో గోపిచంద్‌తో పక్కా కమర్షియల్ అనే మూవీని చేస్తున్నారు.

జిఏ2 పిక్చర్స్ యూవి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తుండగా గోపిచంద్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. బండ్ల గణేశ్‌ కు తాజాగా దర్శకుడు మారుతీ ఓ పాత్రను ఆఫర్ చేశాడని తెలుస్తోంది.

వాస్తవానికి గతంలో ‘ప్రతి రోజూ పండగే’ సినిమాలోనే ఓ పాత్రను మారుతీ… గణేశ్‌కు ఆఫర్ చేసినా… అప్పట్లో అతను నిరాకరించినట్టు తెలిసింది. ఇప్పుడు మాత్రం ఈ ‘పక్కా కమర్షియల్‌’ మూవీలోని పాత్రకు గణేశ్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

- Advertisement -