- Advertisement -
తెలంగాణ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 873 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా నలుగురు మృతిచెందారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,63,526కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 11,643 యాక్టివ్ కేసులుండగా 2,50,453 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1430కి చేరింది. 24 గంటల్లో 1296 మంది కరోనా నుంచి కోలుకోగా మొత్తం 51,34,335 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
- Advertisement -