91 లక్షలకు చేరువలో కరోనా కేసులు…

56
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 91 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 45,209 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 501 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90,95,807కు చేరాయి.

ప్రస్తుతం దేశంలో 4,40,962 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 85,21,617 మంది బాధితులు కరోనా నుండి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. కరోనాతో ఇప్పటివరకు 1,33,227 మంది మృతిచెందారు.

ఇప్పటివరకు 13,17,33,134 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నవంబర్‌ 21న 10,75,326 నమూనాలను పరీక్షించామని ఐసీఎంఆర్ తెలిపింది.