రాష్ట్రంలో 24 గంటల్లో 1914 కరోనా కేసులు…

26
ts corona

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండగా గత 24 గంటల్లో 1914 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఐదుగురు మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 3,16,649కి చేరగా 3.03 లక్షల మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,617 యాక్టివ్‌ కేసులుండగా 1734 మంది కరోనాతో మృతిచెందారు. గత 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 393 , మేడ్చల్‌ 205, నిజామాబాద్‌ 179, రంగారెడ్డి జిల్లాలో 169 నమోదయ్యాయి.