రాష్ట్రంలో 24 గంటల్లో 4446 కరోనా కేసులు…

19
corona in ts

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 4446 క‌రోనా కేసులు న‌మోదుకాగా 12 మంది బాధితులు మ‌ర‌ణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య‌ 3.46 ల‌క్ష‌ల‌కు చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 33,514 యాక్టివ్ కేసులుండగా 1,809 మంది బాధితులు వైర‌స్‌తో మృతిచెందారు. 3.11 లక్ష‌ల మంది కరోనా నుండి కోలుకున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 598, రంగారెడ్డి జిల్లాలో 326, నిజామాబాద్‌లో 314 ఉండగా రాష్ట్రంలో నిన్న 1,26,235 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.