ఉల్లి ధరపై కేంద్రం కీలక నిర్ణయం!

188
onion price
- Advertisement -

భారీ వర్షాలతో పంటలు దెబ్బతినడంతో ఉల్లి ధరలు కొండెక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్‌లో ఉల్లి ధర సెంచరీ మార్క్ దాటగా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వార్తలు వెలువడుతుంటంతో ఉల్లి కొనకుండానే కన్నీరు పెట్టిస్తోంది.

దీంతో ఉల్లి ధరను నియంత్రించడానికి కేంద్రం ప్రణాళికలు సిద్దం చేసింది. ఇప్పటికే పలు నిబంధనలను సడలించిన కేంద్రం తాజాగా ముందస్తు నిల్వల (బఫర్‌ స్టాక్‌) నుంచి ఉల్లిని తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. అసోం, ఏపీ, బిహార్‌, చండీగఢ్‌, హరియాణా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఈ నిల్వల నుంచి 8,000 టన్నులు తీసుకొంటున్నాయని, ఇతర రాష్ట్రాల స్పందన కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు వెల్లడించారు.

ఇప్పటి వరకు 43,000 టన్నులు బఫర్ స్టాక్ నుంచి వివిధ రాష్ట్రాలకు పంపగా మరో 25వేల టన్నులు ఉన్నాయని…. ప్రస్తుతం వీటిని కిలో రూ.26కే అందజేస్తామని, అదనంగా రవాణ ఛార్జీలు వసూలు చేస్తామని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -