అఫ్ఘన్‌ నుండి వచ్చేవారికి ఈ వీసా తప్పనిసరి

303
e visa
- Advertisement -

ఆఫ్ఘ‌న్ జాతీయుల పాస్‌పోర్ట్‌లు గ‌ల్లంత‌య్యాయ‌న్న వార్త‌ల నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం తీసుకుంది. ఆఫ్ఘ‌నిస్థాన్ నుంచి వ‌చ్చే అంద‌రికీ ఈ-వీసాలు త‌ప్ప‌నిస‌రి అని కేంద్ర హోంశాఖ స్ప‌ష్టం చేసింది. ఇక గ‌తంలో ఇండియ‌న్ వీసాలు పొంది ఇప్పుడు మ‌న దేశంలోని లేని ఆఫ్ఘ‌న్ల వీసాల‌న్నింటినీ ర‌ద్దు చేసిన‌ట్లు కూడా ప్ర‌క‌టించింది.

ఇండియాకు రావాల‌ని అనుకుంటున్న ఆఫ్ఘ‌న్ జాతీయుల ద‌ర‌ఖాస్తుల‌ను వేగ‌వంతం చేయాల‌న్న ఉద్దేశంతో ఈ నెల మొద‌ట్లో భార‌త ప్ర‌భుత్వం కొత్త‌గా ఈ-వీసాల‌ను జారీ చేయాల‌ని నిర్ణ‌యించింది. ఇండియాకు రావాల‌నుకుంటున్న ఆఫ్ఘ‌న్లు వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అధికారిక పోర్ట‌ల్‌ను కూడా సూచించింది. www.indianvisaonline.gov.inలో ఆఫ్ఘ‌న్ జాతీయులు త‌మ ఈ-వీసాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం తెలిపింది. నిర్ధిష్ట కాల ప‌రిమితితో ఈ వీసాల‌ను జారీ చేస్తున్నారు.

- Advertisement -