- Advertisement -
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ ఈ నెల 29న మద్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్‌ను ప్రారంభిస్తారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దసరా పండుగ రోజు ధరణి పోర్టల్‌ను ప్రారంభించాలనుకున్నప్పటికీ వాయిదా పడింది. మొత్తంగా ఈ నెల 29న ధరణి పోర్టల్ అందుబాటులోకి రానుంది.ధరణి పోర్టల్ అమలులోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో వ్యవసాయ భూమలు, ఇళ్ల భూముల సహా అన్ని రకాల రిజిస్ట్రేషన్లు దీని ద్వారానే జరుగుతాయని సీఎం కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి గత కొద్ది రోజుల నుంచి రెవెన్యూ సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తోంది ప్రభుత్వం. దీనిపై జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.
- Advertisement -