రైతులు నష్టపోవద్దనే ఈ నిర్ణయం- కేసీఆర్‌

55
cm kcr

‘‘వరి ధాన్యం కొనుగోలు కోసం ఏర్పాటు చేసే కేంద్రాల్లోనే మక్కలను కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. మార్క్ ఫెడ్, వ్యవసాయశాఖ, పౌరసరఫరాల శాఖ సమన్వయంతో ఈ కొనుగోళ్లు చేపట్టాలి. రైతులు నష్టపోవద్దనే ఏకైక కారణంతో ఈసారి మక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించాం. యాసంగిలో ఎట్టి పరిస్థితుల్లో మక్కలు సాగు చేయవద్దని రైతులను మరోసారి కోరుతున్నా. ప్రభుత్వం సూచించిన మేరకు మక్కలు సాగు చేయవద్దు. ఇంత చెప్పినా సరే, మళ్లీ ఎవరైనా మక్కలు సాగు చేస్తే ప్రభుత్వ బాధ్యత లేదు. యాసంగిలో పండే మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశాలు లేవు’’ అని సిఎం స్పష్టం చేశారు.

‘‘రైతులు పండించిన పంటలకు మంచి ధర రావాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం నిర్ణీత పంటల సాగు విధానం తెచ్చింది. రైతులు ఈ విధానం ద్వారా తమ చైతన్యం చాటుకున్నారు. మక్కల విషయంలోకూడా అలాగే వ్యవహరించాలి. వాస్తవానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరించిన విధానం కారణంగానే మక్కలకు ధర పడిపోయింది. మక్కలపై 50 శాతం ఉన్న దిగమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 15 శాతానికి తగ్గించింది. దీనివల్లనే మక్కల ధర పడిపోయింది. మక్కల ధర పడిపోవడానికి కారణమైన పార్టీ నాయకులే ఇప్పుడు రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఈ విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ ప్రయోజనాల కోసం రాద్దాంతం చేసే వారి మాటలు నమ్మొద్దు’’ అని కేసీఆర్ కోరారు.