- Advertisement -
కరోనా నేపథ్యంలో వ్యవసాయంపై ఎలాంటి ప్రభావం పడకుండా పంటలు కొనుగోలు చేశామని తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. నాగర్ కర్నూల్ జిల్లా గుడిపల్లి రిజర్వాయర్ ప్యాకేజీ 29,30 నుంచి నాగర్‌కర్నూల్, అచ్చంపేటకు సాగునీటి విడుదల చేశారు.
ఈ సందర్భంగా నింరజన్ రెడ్డి మాట్లాడుతూ..గత ఏడాదిలో జూలై, ఆగస్టులో నీటి విడుదల జరిగితే ఏప్రిల్ దాకా నీళ్లు పారాయని తెలిపారు. దీంతో చెరువుల్లో సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి. యాసంగికి కూడా ఢోకా ఉండదన్నారు.సీఎం కేసీఆర్ వందేళ్ల ముందు చూపుతో పనిచేస్తున్నారని కొనియాడారు.
మెట్ట పంటలు, కంది,పత్తి బాగున్నాయని తెలిపారు. కాల్వలు, చెరువులకు గండి పెట్టవద్దని రైతులకు సూచించారు. నష్టమున్నా 7,253 కోట్ల రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. 2021 జూన్, జూలై నాటికి పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ద్వారా నీళ్లు అందజేస్తామన్నారు.
- Advertisement -