రైతు వేదికల ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మం నగరం 7వ డివిజన్ అల్లిపురం దంసలాపురం పరిధిలో రైతు వేదిక నిర్మాణ పనులను ప్రారంభించారు.
సీఎం కేసీఆర్ రైతులకు అనుకూలమైన చర్యలు చేపడుతున్నారని… రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ వారికి గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నారు. రైతు వేదికల ద్వారా కర్షకులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని…. రైతు బీమా వల్ల అనేక రైతు కుటుంబాలు లబ్ధి పొందాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , జడ్పీ చైర్మన్ కమల్ రాజ్ , మేయర్ పాపాలాల్ , సుడా చైర్మన్ విజయ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, రైతు బంధు జిల్లా కో ఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వర రావు, జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, అధికారులు, కార్పొరేటర్లు, రైతులు ఉన్నారు.