24 గంటల్లో 19,459 కరోనా పాజిటివ్ కేసులు..

154
coronavirus
- Advertisement -

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతోంది. రోజుకు దాదాపుగా 20 వేల కేసులు నమోదవుతుండటం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇక గత 24 గంటల్లో 19,459 కొత్త కేసులు నమోదుకాగా 380 మంది మృత్యువాతపడ్డారు.

ఇక దేశంలో ఇప్పటివరకు 5,48,318 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 16,475 మంది మృతిచెందారు. ప్రస్తుతం 2,10,120 యాక్టివ్ కేసులు ఉండగా, 3,21,723 మంది కరోనా నుండి కొలుకోని డిశ్చార్జ్ అయ్యారు.

మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,64,626 కేసులు నమోదుకాగా 7,429 మంది మృతిచెందారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 83,077కి చేరగా, 2623 మంది మరణించారు.

- Advertisement -