జనంతో సంబంధంలేని జనసేనాని: ఎమ్మెల్యే రాపాక ఫైర్

100
janasena

జనసేనాని పవన్ కల్యాణ్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన 2019లో తాను వైసీపీ టికెట్ ఆశీంచానని కానీ టికెట్ రాకపోవడంతో జనసేన నాయకుల కోరిక మేరకు ఆ పార్టీ నుండి పోటీచేశానని తెలిపారు.

జనసేనకు కేడర్ లేదని కేవలం అధ్యక్షుడే ఉన్నారని తెలిపారు రాపాక. చిరంజీవి…పవన్‌ మధ్య ఎంతో తేడా ఉందని…జనంతో సంబంధంలేని నాయకుడు పవన్ కల్యాణ్ అన్నారు.

పవన్‌ను రాంగ్ ట్రాక్‌లోకి తీసుకెళ్తుంది నాదేండ్ల మనోహర్‌ని దుయ్యబట్టారు రాపాక. పార్టీలో ఉన్నవాళ్లు అదే అనుకుంటున్నారని వెల్లడించారు. ఇక సోషల్ మీడియాలో ఉన్నవాళ్లు ఓటు వేసి గెలిపించడానికి పనిచేయరని.. ఇంకొకళ్లను తిట్టడానికి పనికొస్తారని జనసైనికులపై విమర్శలు గుప్పించారు.