మొక్కలు నాటిన కలెక్టర్ ప్రశాంత్ జీవన్

34
mlc gutha

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ద్వారా హరిత విప్లవం తీసుకొచ్చారని, పర్యావరణాన్ని రక్షించడం అందరి బాధ్యతగా స్వీకరించి, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

మన రాష్ట్రం లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక పర్యావరణానికి పెద్ద పీఠ వేశారు , కలప వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టారు . అర్బన్ పార్కుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది . ఇది భవిష్యత్ తరాలకు ఎంతో మేలు చేస్తుంది ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పాల్గొనాలని ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు.

యాదాద్రి జిల్లా కలెక్టర్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ , రాచకొండ సిపి గార్లను మొక్కలు నాటాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో ఎంపీ గుత్త సుకేందర్ రెడ్డి గారు , ఎమ్మెల్యే చిరుముర్తి లింగయ్య గార్లు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.