జూబ్లీహిల్స్‌లో రక్తదాన శిబిరం..పాల్గొన్న హోంమంత్రి

293
mahmood ali
- Advertisement -

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటిఆర్ పిలుపు మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో షేక్ పెట్ డివిజన్ ప్రెసిడెంట్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లోబ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హోంమంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు.

ఈసందర్భంగా మాట్లాడిన మహమూద్ అలీ …..కేటీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే లు అందరూ బ్లడ్ డోనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నారని తెలిపారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు అలీ.

అందరూ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని… పోలీసులు,మున్సిపల్ సిబ్బంది బాగా పనిచేస్తున్నారని తెలిపారు.

రేషన్ కార్డు ఉన్న పేదలకు బియ్యం తో పాటు 1500 రూపాయలు ఇచ్చి అదుకుంటున్నాం..వలస కూలీలను అదుకుంటున్నాం.. అన్నారు. ప్రజలు బయట కు రాకండి అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చిన జాగ్రతలు పాటించాలన్నారు.రంజాన్ మాసం లో ముస్లిం సోదరులు ఇండ్ల లొనే ఉంటూ నమాజు చేసుకోవాలన్నారు.

కేటీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గ పరిధిలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం..రక్తదానం చేయడానికి యువత ముందుకు వస్తున్నారని తెలిపారు ఎమ్మెల్యే గోపినాథ్. ఇది విజయవంతంగా కొనసాగుతుందన్నారు. నియోజక వర్గంలో ఉన్న పేదలను వలస కూలీలను అదుకుంటున్నాం..అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా అన్నదాన కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంద న్నారు.

- Advertisement -