- Advertisement -
నేడు రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు,పెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా దేవరకొండలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ క్యాంప్ కార్యాలయంపై పిడుగు పడింది. అయితే అది బంగ్లా పైనున్న పెంట్ హౌస్ అంచున పడడంతో ఎమ్మెల్యే, ఆయన కుటుంబానికి పెను ప్రమాదం తప్పింది, ఆ సమయంలో ఎమ్మెల్యే ఇంట్లోనే ఉన్నట్లు సమాచరం.
ఇదిలా ఉండగా,ఉపరితల ఆవర్తన ద్రోణి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ప్రయాణించనుంది. దీని ప్రభావం కారణంగా తెలంగాణలో ఇవాళ, రేపు, ఎల్లుండి అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.
- Advertisement -