లాక్ డౌన్‌ పొడగింపు….పుకార్లే: కేంద్రం

241
rajiv
- Advertisement -

లాక్ డౌన్‌ను మరిన్ని రోజుల పాటు పొడగించే ఆలోచనేమీ ప్రస్తుతానికి లేదని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 14వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. 21 రోజుల తర్వాత లాక్ డౌన్ పొడగిస్తారని ప్రచారం జరుగుతుండగా వీటిని ఖండించింది కేంద్రం.

సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమైనవని….ఇలాంటి ఉహాగానాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా స్పష్టం చేశారు. వదంతులను ప్రజలు నమ్మవద్దని…లాక్ డౌన్ పొడగింపుపై ఎలాంటి కార్యచరణ తమ వద్ద లేదని స్పష్టం చేశారు.

దేశంలో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 1071కు చేరగా 29 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -