తెలుగు రాష్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపుర్ వరుస హత్యల కేసులో తుది తీర్పు నేడు రానుంది. ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రావణి, మనీషా, కల్పన ల హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణను ముగించింది. ఇరుపక్షాల వాదనలు విన్న నలగొండ ఫాస్ట్ కోర్టు… ఇవాళ తుది తీర్పును వెలువరించనుంది.
ఈనెల 7న ఈకేసును విచారించిన నల్లగొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తుది తీర్పను 27కు వాయిదా వేసింది. నిందితుడికి మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ బలంగా వాదన వినిపించిన నేపథ్యంలో ఫోక్సో కోర్టు ఎటువంటి తీర్పును వెల్లడిస్తుందో అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతుంది. మరోవైపు నవంబర్ 24న జరిగిన సమత హత్య కేసులో కూడా నేడు తీర్పు వెలువడనుంది. రెండు సంచలన తీర్పులు ఇవాళ వెలువడనుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.