హాజీపూర్‌ వరుస హత్యల కేసులో నేడు తుది తీర్పు

353
hajipur
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్య కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. ఈ వరుస హత్యల కేసులో.. ఇప్పటికే విచారణ ముగిసిపోయింది. దీంతో సైకో కిల్లర్‌ మర్రి శ్రీనివాస్‌ రెడ్డికి శిక్ష ఖరారయ్యే అవకాశం ఉంది. సమత హత్య కేసులో నిందితులైన ముగ్గురికి ఇప్పటికే ఉరిశిక్ష ఖరారైంది. కాగా ఈ హాజీపూర్ వరుస హత్యల కేసులో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత నెల 27వ తేదీన తీర్పు వెలువుడుతుందని అంతా అనుకున్నప్పటికీ.. కొన్ని కారణాలతో తీర్పును ఇవాళ్టీకి వాయిదా వేసింది ఫోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు.

కాగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని హాజీపూర్‌ గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి గ్రామంలోని ముగ్గురు అమ్మాయిలను బైక్ పై తీసుకెళ్లి అత్యాచారం చేసి తన పోలం వద్ద ఉన్న బావిలో పూడ్చిపెట్టాడు. అయితే గతేడాది ఏప్రిల్‌ 25వ తేదీన హాజీపూర్‌కు చెందిన శ్రావణి అనే ఓ బాలిక కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. 26వ తేదీన కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయ బావి వద్ద ఆ బాలికకు చెందిన స్కూల్‌ బ్యాగ్‌ను గ్రామస్తులు గుర్తించారు. దీంతో శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్ విచారించారు. దీంతో ఆమూడు హత్యలు తానే చేసినట్లు ఒప్పుకున్నాడు శ్రీనివాస్ రెడ్డి.

- Advertisement -