తొలిసారి… అమ్మ లేకుండా ఎన్నికలు

171
Jayalalithaa passed away
- Advertisement -

తమిళనాడు రాజకీయాల్లో తొలిసారి అమ్మలేకుండా ఎన్నికలు జరిగాయి. జయలలిత ప్రచారం లేకుండా బరిలోకి దిగిన అన్నాడీఎంకే విజయఢంకా మోగించింది. అనారోగ్య కారణాలతో సెప్టెంబర్ లో ఆస్పత్రిలో జయలలిత చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  ఉప ఎన్నికలు జరిగిన మూడు నియోజకవర్గాలు అరవన్ కుర్చి, తంజావూరు, తిరుపరంగుండ్రంలో అన్నాడీఎంకే ఘనవిజయం సాధించింది.

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆస్పత్రి పాలవటంతో గెలుస్తుందా లేదా అన్న సందేహాలను పటా పంచలు చేస్తు ప్రజలు అమ్మవైపే మొగ్గుచూపారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు స్టాలిన్‌తో పాటు డీఎంకే సీనియర్ నేతలు శ్రమించిన ఫలితం లేకపోయింది. తొలుత జయ లేకపోవడంతో విపక్షాలకే ప్లస్ అవుతుందనుకున్నా….ఫలితాలు వచ్చే సరికి సీన్ రివర్సైంది. దీంతో అమ్మ మరోసారి అమ్మ తమిళ రాజకీయాల్లో తనపట్టును నిలుపుకుంది.

జ‌య‌ల‌లిత ఎన్నిక‌ల ద‌ర‌ఖాస్తుపై వేలి ముద్ర పెట్టారు. గ‌త నెల రోజులుగా చెన్నై అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న జ‌య త‌మ పార్టీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించేందుకు వేలి ముద్ర పెట్టాల్సి వ‌చ్చింది. జ‌య కుడి చేయికి ఇన్‌ఫెక్ష‌న్ కావ‌డం వ‌ల్ల ఆమె సంత‌కం చేయ‌లేక‌పోయిన‌ట్లు అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే.

- Advertisement -