ప్రజా గాయకుడు గద్దర్ ఇకలేరు..

38
- Advertisement -

ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఇకలేరు. అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇటీవల గుండెపోటు రావడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి క్షిణించి ఆరోగ్యం విషమిండంతో ఆయన మృతిచెందారు. గద్దర్ మృతి పట్ల పలువరు సంతాపం తెలిపారు.

గద్దర్ పూర్తి పేరు గుమ్మడి విఠల్ రావు . మెదక్ జిల్లా లోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో జన్మించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేశారు. గద్దర్ భార్య పేరు విమల, ఆయనకు ముగ్గురు పిల్లలు, సూర్యుడు, చంద్రుడు ( 2003 లో అనారోగ్యంతో మరణించారు), వెన్నెల.

మాభూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి యాదగిరి పాడిన బండెనక బండి కట్టి అనే పాటను ఆయనే పాడారు. 1985 లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. 1997 ఏప్రిల్ 6 న జరిగిన కాల్పుల్లో ఆయన శరీరంలోకి అనేక బుల్లెట్లు దిగాయి. అన్ని బుల్లెట్ లను తొలగించారు కాని ఒక్క బుల్లెట్ ను మాత్రం డాక్టర్ లు తొలగించలేదు. అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని వదిలేశారు. ఆయన ఒంట్లో ఇప్పటికి బుల్లెట్ ఉంది.

Also Read:అసెంబ్లీ సమావేశాలు పొడగింపు..

గద్దర్ మొదటి నుండి తెలంగాణా వాదే. గద్దర్ రాసిన పాటల్లో “అమ్మ తెలంగాణమా” అనే పాట బహుల ప్రజాదరణ పొందింది. తెలంగాణలోని అన్ని అంశాలను స్పృశిస్తూ సాగింది ఈ పాట. ఆయన రాసిన “నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ” అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది. జై బోలో తెలంగాణా సినిమాలో ‘పొడుస్తున్న పొద్దూ’ మీద పాట ఆయనే రాసి పాడి, అభినయించారు. అమ్మ తెలంగాణా ఆకలి కేకల గానమా అనే పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపిక చేశారు.

Also Read:కే‌సి‌ఆర్ బరిలో దిగేది..అక్కడినుంచే?

- Advertisement -