హైదరాబాద్‌ మెట్రోలో గుండె తరలింపు..

122
metro hyderabad

హైద‌రాబాద్ మెట్రో రైలులో తొలిసారి బ్రెయిన్ డెడ్ అయిన మ‌నిషి గుండెను త‌ర‌లించారు. ఎల్బీన‌గ‌ర్ కామినేని ఆస్ప‌త్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రికి గుండెను త‌ర‌లించారు.ఇందుకోసం నాగోలు మెట్రో స్టేష‌న్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వ‌ర‌కు గ్రీన్ ఛానెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ఉండే ట్రాఫిక్ దృష్ట్యా మెట్రో మార్గాన్ని వైద్యులు ఎంచుకున్నారు. మెట్రో రైలు అధికారుల‌కు ఆస్ప‌త్రి సిబ్బంది స‌మాచారం ఇవ్వ‌డంతో ఈ ఏర్పాట్లు చేశారు.

న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన 45 ఏండ్ల రైతు బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో గుండెను దానం చేసేందుకు ఆ రైతు కుటుంబం ముందుకొచ్చింది. దీంతో రైతు గుండెను మరో వ్య‌క్తికి అమ‌ర్చ‌నున్నారు. డాక్ట‌ర్ గోకులే నేతృత్వంలో ఈ శ‌స్ర్త‌చికిత్స నిర్వ‌హించ‌నున్నారు.