- Advertisement -
తిరు నక్షత్ర (పుట్టిన రోజు) మహోత్సవాలు శంషాబాద్ ముచ్చింతల్‌లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 28 నుంచి నవంబర్ 1 వరకు జరగనుండగా ఉత్తరరామాయణ , వైకుంఠ గద్యం , శరణాగతి గద్యం , శ్రీ మద్భాగవతమ్ పుస్తక గ్రంధాలను అవిష్కరించారు చిన్నజీయర్ స్వామి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తిరు నక్షత్ర మహోత్సవంలో భాగంగా ఇవాళ గ్రంథాఆవిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, 30న బుధవారం దైవవ వరివస్య, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, 31న గురువారం భాగవత వరివస్య, సాయంత్రం సహస్ర కలశాభిషేక అంకురార్పణ, 1న శుక్రవారం శ్రీ స్వామి వారి ఆరాధ్య మూర్తి శ్రీరామచంద్ర స్వామి సహస్ర కలశాభిషేకము వేడుకలు జరగనున్నాయి.
- Advertisement -