‘హిట్ల‌ర్’ అంటు పిక్‌ పోస్ట్‌ చేసిన మెగా డాటర్‌..!

462
niharika
- Advertisement -

దీపావ‌ళి పండుగను మెగా కుటుంబం ఎంతో వైభవంగా జరుపుకున్నారు. మెగాస్టార్‌ ఇంట్లో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌,నాగబాబు కుంటుంబం అందరూ కలిసి ఈ సెలెబ్రేషన్స్ లో పాలు పంచుకున్నారు. కాగా ఇందులో భాగంగా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల త‌న‌య నిహారిక‌ త‌న ట్విట్ట‌ర్ ద్వారా హిట్ల‌ర్ పిక్చ‌ర్ అని ఓ ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోలో చిరు కూతుళ్ళు శ్రీజ‌, సుస్మిత‌తో పాటు నిహారిక ఆమె కజిన్స్ ఉన్నారు. వారి వెనుక వ‌రుణ్ తేజ్ ఉన్నాడు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ ఫోటో షేర్ చేయ‌గా, ఈ ఫోటోకి నిహారిక పెట్టిన హిట్ల‌ర్ పిక్చ‌ర్ అనే కామెంట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అయితే హిట్ల‌ర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి త‌న చెల్లెళ్ళ‌ని కంటికి రెప్ప‌లా ఎలా చూసుకుంటాడో, ఇక్క‌డ వ‌రుణ్ తేజ్ కూడా నిహారిక గ్యాంగ్‌కి అండ‌గా ఉంటున్నాడ‌ని త‌న కామెంట్ ద్వారా తెలిపింది. ప్రస్తుతం నిహారిక ఇటు సినిమాలు చేస్తూనే, అటూ డిజిటల్‌లోను రాణిస్తోంది. ఆమె ఇప్పటి వరకు తెలుగులో మూడు చిత్రాలు చేశారు. ‘ఒక మనసు’ ‘హ్యాపీ వెడ్డింగ్’,‘సూర్యకాంతం’. ఈ మూడు చిత్రాలు అనుకున్నంతగా అలరించలేదు.

- Advertisement -