చినజీయర్ స్వామీ తల్లికి సుఖేందర్ రెడ్డి సంతాపం..

240
Gutha Sukender Reddy

శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామీజీ మాతృమూర్తి అలివేలు మంగమ్మ పరమపధం చెందడం పట్ల తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపాన్ని తెలిపారు. స్వామీజీ మాతృమూర్తి అలివేలు మంగమ్మ ఆత్మకు ఆ భగవంతుడు శాంతిని ప్రసాదించాలని ప్రార్ధించారు. గొప్ప సేవా గుణం, ఆధ్యాత్మిక భావాలు కలిగిన కుమారునికి జన్మనిచ్చిన అలివేలు మంగమ్మ జన్మను సార్ధకం చేసుకున్నారని ఆయన తెలిపారు.