రోజుకు3 మొత్తం 250డ్రెస్ లు..టైటిల్ ఆయనదే!

535
Vithika Varun
- Advertisement -

 బిగ్ బాస్ సీజన్ 3 తుది దశకు చేరుకుంది. ఇంకో నాలుగు రోజుల్లో టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఇక చివరి వారం ఎటువంటి గేమ్స్ లేకుండా హౌస్ మెట్స్ తో ఎంజాయ్ చేపిస్తున్నారు బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ 3 టైటిల్ మా ఆయనకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తుంది వితిక. రెండు వారాల క్రితం వితిక బిగ్ బాస్ నుంచి ఎలిమినెట్ అయిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గోన్న వితిక బిగ్ బాస్ హౌస్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

vithika

బిగ్ బాస్ -3 లో తాను హౌస్ లో ఉన్న సమయంలో మొత్తం 250 డ్రస్ లను మార్చానని, రోజుకు మూడు డ్రస్ లను వేసుకున్నానని చెప్పింది.నేను హౌస్ లో ఉన్నప్పుడు ఏ టాస్క్ ఇచ్చినా సరే వరుణ్ సందేశ్ నా కంటే బాగా ఆడేవాడని చెప్పింది. వరుణ్ ఒంటరిగా ఉంటే మరింత బాగా ఆడుతాడని నాకు చాలా మంది చెప్పారని…నేను కూడా గమనిస్తున్నానని అందుకే నేను బయటకు వచ్చినందుకు బాధగా లేదని వ్యాఖ్యానించింది. హౌస్ లో వంటలు చేయడంలో తానే బెస్ట్ అని చెప్పుకోచ్చింది.

హౌస్ లో కిచెన్ కెప్టెన్ గా అందరి కంటే ఎక్కువగా ఆరువారాలు నేను ఉన్నానని గుర్తు చేసింది. వరుణ్ ఫైనల్ లో రూ.50లక్షలు గెలిస్తే భద్రంగా దాచుకుని ఫిక్సడ్ డిపాజిట్ చేస్తామని చెప్పింది. పెళ్లి తర్వాత 2సంవత్సరాలు ఫైనాన్షియల్ తాము చాలా ఇబ్బందిపడ్డామని తెలిపింది. ఇక ఫైనల్ లో వరుణ్ తో పాటు శ్రీముఖి, రాహుల్ లు ఉంటారని చెప్పింది.

- Advertisement -