పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లో అత్యంత ఆదరణ పొందిన టోర్నీగా ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) కు ప్రత్యేక స్ధానం ఉంది. ఇక ఐపీఎల్ 2020 ప్రారంభానికి మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉండటంతో ఇప్పటికే ఆటగాళ్ల రీటైన్ పూర్తయింది. డిసెంబర్ 19న కోల్ కతా వేదికగా ఆటగాళ్ల వేలం జరగనుంది.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సారి ఐపీఎల్‌లోకి కొత్తగా 9వ జట్టు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2014 నుంచి 8 జట్లతోనే ఐపీఎల్ నిర్వహిస్తూ వస్తుండగా ఈ సారి 9 జట్లతో ఐపీఎల్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ప్రారంభంకానుండగా
2008లో 8 జట్లతో ఐపీఎల్ ప్రారంభం కాగా 2011లో 10 జట్లతో ఈ మెగా టోర్నీని నిర్వహించారు. ఇక ఈ సారి ఒక జట్టు పెరుగుతుండటంతో మ్యాచ్‌ల సంఖ్య కూడా 60 నుంచి 76కి పెరిగే అవకాశం ఉంది.
ఐపీఎల్‌లో ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ ఉండగా గతేడాది ముంబై ఛాంపియన్‌గా నిలిచింది.
IPL 2020: Complete list of players retained and released by teams … A total of nine players have been released by Delhi Capitals