వాటర్‌ జంక్షన్‌గా మిడ్ మానేరు: వినోద్ కుమార్

597
vinod kumar
- Advertisement -

మిడ్ మానేరు “వాటర్ జంక్షన్” గా మారిందన్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాట్లాడిన వినోద్ కుమార్ …కాళేశ్వరం ఎత్తి పోతల ద్వారా మిడ్ మానేరు 15 టీఎంసీ లు నింపడం జరిగిందన్నారు. కొత్త ప్రాజెక్టు ను ఒకేసారి నింపడం సారి కాదని నిపుణులు చెప్పారు.మానేరు డ్యామ్ కి రెండున్నర కిలోమీటర్ల మేర ఒర్రె ప్రాంతం లో సాయిల్ సమస్యను గుర్తించి నీటిని లోయర్ మానేరు కు విడుదల చేశామని చెప్పారు.

ప్రతిపక్షాలు మిడ్ మానేరు పై అనవసర రాద్ధాంతం చేశాయని ఆరోపించారు వినోద్. రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదని…టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసిందన్నారు.

కరీంనగర్ నగర ప్రజలకి ఎల్ ఎం డి, మిడ్ మానేరు జలాలు ఉపయోగపడతాయని…చిన్న పాటి సంకేతిక సమస్యను గుర్తించి వేగవంతంగా పరిష్కరించామన్నారు. ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా అధికారులను అడిగి తెలుసుకున్నామని… ఎలాంటి లోపాలు లేవని చెప్పారని వెల్లడించారు. వారం రోజుల తరువాత డ్యామ్ ను పరిశీలించి పూర్తి స్థాయిలో నీటిని నింపుతామన్నారు.

telangana planning commission vice chairman vinod kumar says Mid Maner for Water Junction…Mid Maner for Water Junction says vinod kumar

- Advertisement -