పోలీసు కుటుంబాల కోసం ఉచిత వైద్య శిబిరం..

680

రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ పోలీసు స్టేషన్‌లో కిమ్స్, మ్యాక్సీవిజన్, ఫోర్ట్ డెంటల్ ఆసుపత్రుల సంయుక్త ఆధ్వర్యంలో పోలీసు కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. సిపితో పాటు మల్కాజిగిరి డీసీపీ రక్షిత కె. మూర్తి, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, సీఐ చంద్రశేఖర్, పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

free health camp

ఈసందర్బంగా విధినిర్వహణలో పోలీసులు ఆత్మహత్య, ఆక్సిడెంట్ లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి కాపాడిన పోలీసుల్ని అభినందించి సన్మానించారు. ఈసందర్భంగా డీసీపీ రక్షిత కె. మూర్తి మాట్లాడుతూ.. పోలీసులకు విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారని ప్రతీ ఒక్కరు ఈవైద్య శిబిరంలో పాల్గొని గుండె, కంటి, పంటి తదితర వ్యాధులకు సంబంధించి చెకప్ చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు.

rachakonda pc

సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. ప్రతీ పోలీసు స్టేషన్లో పోలీసులందరూ చెకప్ చ్చేసుకోవలని సూచించారు. బీపీ, షుగర్ వ్యాధులను కంట్రోల్ చేయడానికి ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని తెలిపారు. అలాగే ప్రతీరోజు ఓ గంట వ్యాయామం చేయాలని తెలిపారు. పోలీసు ఉద్యోగాలు నిరంతరం ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉద్యోగం చేయాల్సి ఉంటుందని ఆరునెలలకోసారి చెకప్ చేసుకుని తగిన మందులు తీసుకుని ఆరోగ్యం కాపాడుకుంటూ ఫిట్ గా, ఆక్టీవ్ గా ఉండాలని తెలిపారు. ఈవైద్య శిబిరంలో పాల్గొని పోలీసులు వారి కుటుంబ సభ్యులు చెక్ చేసుకోవాలని ఈ వైద్య శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

A free medical camp for police families was held under the auspices of Kims, Maxivision and Fort Dental Hospitals at Kushaiguda Police Station under..