- Advertisement -
దేశంలో కరోనా కోరలు చాస్తోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 8,582 మంది కరోనా పాజిటివ్‌గా తేలగా 4గురు మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,32,22,017కు చేరగా 4,26,52,743 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 44,513 కేసులు యాక్టివ్‌గా ఉండగా 5,24,761 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు 0.10 శాతానికి చేరగా రికవరీ రేటు 98.68 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.71 శాతానికి చేరగా ఇప్పటివరకు 1,95,07,08,541 టీకాలను పంపిణీ చేశారు.
- Advertisement -