తొమ్మిది రోజుల పాటు అశేష భక్తుల పూజలు అందుకున్న గణనాథుడు వేలాది మంది భక్తుల మధ్య వినాయక్ ఘాట్‌కు బొజ్జ గణపయ్యలు తరలివెళ్తున్నారు. హుస్సేన్‌సాగర్‌పై ఏర్పాటు చేసిన ఆరో నంబర్ క్రేన్ వద్ద ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపే మహాగణపతి నిమజ్జనం పూర్తికానుంది. .
హైదరాబాద్‌లో ఎటు చూసిన సందడి వాతావరణమే కనిపిస్తోంది. ఏ గల్లీ చూసినా గణపతి బప్పా మోరియా నినాదాలే. జై భోలో గణేశ్ మారాజ్‌కి అనే నినాదాలతో దద్దరిల్లిపోతున్నాయి. పిల్లలు,పెద్దలు గణేశ్ శోభాయాత్రలో సందడిచేస్తున్నారు.
హుస్సేన్‌సాగర్ చుట్టూ గణేశ్ నిమజ్జనం సందడి నెలకొంది. వేలాది విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు తరలివస్తుండటంతో.. నిమజ్జనాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ట్యాంక్‌బండ్ పరిసరాలకు చేరుకుంటున్నారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బషీర్ బాగ్, ఎంజే మార్గెట్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, చార్మినార్, కూకట్ పల్లి ప్రాంతాల్లోనూ గణేశ్ శోభాయాత్ర సందడి నెలకొంది.
నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి హుస్సెన్‌సాగర్‌కు పెద్ద ఎత్తున గణనాథులు తరలివస్తున్నాయి. మొత్తం 200 క్రేన్లను ఏర్పాటు చేసిన అధికారులు ఒక్కో క్రేన్ వద్ద గంటకు 25 విగ్రహాలు నిమజ్జనం చేసేలా చర్యలు చేపట్టారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌లో సాధారణ వాహనాలకు ప్రవేశం లేదని పోలీసులు తెలిపారు.