75 రోజుల పాటు బూస్టర్ డోస్ ఉచితం..

26
vaccination
- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తీవ్రమవుతున్న నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 75 రోజులపాటు బూస్టర్ డోస్‌ని ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకుంది. జులై 15 నుంచే ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

దీని ద్వారా 18-59 ఏళ్ల మధ్య వయస్కులు అంటే 77కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకూ 26శాతం అంటే 16కోట్ల మంది 60లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న వారికి, హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్ అందించారు. మొదటి డోస్ లేదా రెండు డోసులు తీసుకున్న ఆరు నెలలకు బూస్టర్ డోస్ తీసుకుంటే ఇమ్యూన్ రెస్పాన్స్ మరింత పెరుగుతుందని వైద్యశాఖ వెల్లడించింది.

ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లలో ఈ ఫ్రీ బూస్టర్ డోస్ వేయనున్నారు. ఇటీవలె కరోనా వ్యాక్సిన్‌ సెకండ్ డోసుకు బూస్టర్ డోసుకు ఉండాల్సిన వ్యత్యాసాన్ని తొమ్మిది నెలల నుంచి ఆరు నెలలకు తగ్గించింది.

- Advertisement -