- Advertisement -
నల్గొండ జిల్లాలో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయయ్యాయని అధికారులు తెలిపారు. నల్లగొండలో ఐదుగురికి, మిర్యాలగూడలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ కొండల్ రావు తెలిపారు. ఈ ఆరుగురు మర్కజ్ భవన్లో మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారేనని వెల్లడించారు.
ప్రస్తుతం వీరిని హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని…వీరి కుటుంబ సభ్యులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి క్వారంటైన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
జిల్లా ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని… వైద్య సిబ్బంది కూడా తగు జాగ్రత్తలతో విధులు నిర్వర్తించాలని సూచించారు.
- Advertisement -