షేన్‌వార్న్ గ్రేటెస్ట్ ఇండియా టీమ్ ఇదే!

248
shane warne
- Advertisement -

ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ..గ్రేటెస్ట్ ఇండియా టీమ్‌ని ప్రకటించాడు. తాను ఎంపీక చేసిన టీంలో దాదా గంగూలీకి కెప్టెన్సీ ఇచ్చిన వార్న్…సచిన్,సెహ్వాగ్,రాహుల్‌కు చోటు ఇవ్వగా ధోని,కోహ్లీలకు మొండిచేయి చూపించాడు.

వికెట్ కీపర్‌గా ధోనికి బదులు నయాన్ మోంగియాకి చోటిచ్చాడు. తాను క్రికెట్ ఆడే సమయంలో ఉన్న భారత క్రికెటర్లతో మాత్రమే ఈ జట్టుని ఎంపిక చేశాను. కాబట్టి.. ధోనీ, విరాట్ కోహ్లీకి ఈ టీమ్‌ చోటివ్వలేదన్నారు. ధోని గొప్ప వికెట్ కీపర్… విరాట్ కోహ్లి అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని వెల్లడించాడు.

షేన్‌వార్న్ గ్రేటెస్ట్ ఇండియా టీమ్ ఇదే:

సౌరవ్ గంగూలీ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధు, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, మహ్మద్ అజహరుద్దీన్, కపిల్ దేవ్, నయాన్ మోంగియా (వికెట్ కీపర్), హర్భజన్ సింగ్, జవగళ్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే

- Advertisement -