జాకీర్ హుస్సేన్ ఖాన్ భారత రాష్ట్రపతిలో మూడవ వ్యక్తి. పదవిలో ఉండగా మరణించిన మొదటి వ్యక్తి అలాగే తొలి ముస్లిం రాష్ట్రపతి కూడా. ఈయన 8ఫిబ్రవరి 1897 హైదరాబాద్(నిజాం) రాజ్యంలో జన్మించారు. హుస్సేన్ ప్రాథమిక విద్యను హైదరాబాద్‌లో పూర్తి చేశారు. లక్నో విశ్వవిద్యాలయంలోని క్రిస్టియన్ డిగ్రీ కళశాల నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టాను పొందారు. విద్యార్థి దశ నుంచి విద్యార్థి నాయకుడిగా ఎదిగారు.
ఇతన్ను జామియా మిలియా ఇస్లామియా(కేంద్రీయ విశ్వవిద్యాలయం) యూనివర్సిటీని స్థాపించిన వారిలో ప్రముఖ డు. 1948లో అలీఘర్ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్‌గా పనిచేశారు. అలాగే యూజీసీ కమిటీ మెంబర్‌గాను సీబీఎస్ఈ ఛైర్మన్‌గా పనిచేశారు. అనంతరం ఈయన్న కాంగ్రెస్ పార్ట ద్వారా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈయన 1957 నుండి 1962వరకు బీహార్ గవర్నర్‌గా పనిచేశారు. అనంతరం రాష్ట్రపతిగా సర్వేపల్లి ఎన్నికకావడంతో ఉపరాష్ట్రపతిగా 1962 నుండి 1967వరకు పనిచేశారు. అంతేకాదు ఉపరాష్ట్రపతి నుండి రాష్ట్రపతిగా ఎన్నికైన రెండవ వ్యక్తి ఈయన్నే.
Also Read: Ashok Gehlot:తిరుగులేని రాజకీయ నేత
భారతదేశానికి మూడవ రాష్ట్రపతిగా 13మే 1967 నుండి 3మే 1969 మరణించే వరకు పనిచేశారు. ఈయన జర్మనిలో ఉన్నప్పుడు ప్రముఖ ఉర్దూ కవి మీర్జా అసదుల్లా ఖాన్ గాలిబ్ సంకలనాన్ని తయారుచేశారు. 1963లో ఈయనకి భారత ప్రభుత్వం భారతరత్న అవార్డుతో సత్కరించింది. జామియా మిలియా క్యాంపస్‌లో ఈయన పేరుమీదుగా స్తూపం కూడా ఉంది. కాగా నేడు ఆయని 54వ వర్థంతి.
Also Read: కేసీఆర్ రియల్ హీరో..వైసీపీ ఎమ్మెల్యే ప్రశంసలు