రూ . 500కే 4జీ ఫోన్‌

183
- Advertisement -

ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్‌ఫోన్ల లేనిదే రోజువారీ జీవితం మెదలవడంలేదు. మొబైల్ తయారీ సంస్థలు కూడా వినియోగదారులకు దగ్గరయ్యేందుకు ధరలు కూడా తగ్గిస్తున్నాయి. దాంతో అధునాత ఫీచర్లు ఉన్న ఫోన్లు రూ.10000 కే లభిస్తున్నాయి. ఇక టెలికాం రంగంలోకి జియో ఎంట్రీ తర్వాత పోటీ మరింతగా పెరిగింది. ఒకానొక దశలో జియో పోటీని తట్టుకోలేక ప్రధాన టెలికాం సంస్థలు బెంబేలెత్తిపోయాయి.

4G smartphones at Rs 500

దీంతో రూ. 1500కే జియో ఫోన్ అందుబాటులోకి రావడంతో పాటు రూ.49కే అన్ లిమిటెడ్ కాలింగ్,1 జిబీ డాటా సదుపాయంతో మరింత ఇబ్బందుల్లో పడ్డాయి టెలికాం సంస్థలు. ఈ నేపథ్యంలో జియో ఇస్తున్న పోటీని తట్టుకునేందుకు మరింత చౌకగా స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నాయి.

నెలకు కేవలం రూ 60 రూపాయలకే వాయిస్‌, డేటా ప్లాన్స్‌తో రూ 500కన్నా తక్కువ ధరలో 4జీ స్మార్ట్‌ ఫోన్‌ల తయారీ కోసం టాప్‌ టెలికాం ఆపరేటర్లు భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సెల్యులార్‌లు హ్యాండ్‌సెట్‌ కంపెనీలతో ప్రయత్నాలు మొదలుపెట్టాయి. జియో వైపుకు మర్లుతున్న యూజర్లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ తరహా స్మార్ట్‌ ఫోన్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు టాప్‌ 3 టెలికాం ఆపరేటర్లు సన్నాహాలు చేస్తున్నాయి. మరి ఈ ప్రయత్నాలు ఫలిస్తే స్మార్ట్ ఫోన్లు మరింత చౌకగా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

- Advertisement -