ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారా..పాక్ క్రికెటర్ ఫైర్!

13
- Advertisement -

భారత్‌లోని జమ్మూ కశ్మీర్‌లో పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదుల్ని స్వాతంత్య్ర సమరయోధులుగా పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్‌ కనేరియా ఫైర్ అయ్యారు.

పాకిస్థాన్‌ ఉప ప్రధాన మంత్రి ఇషాక్‌ దార్‌.. ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులు అంటూ సంబోధించారు. ఇది అవమానకరమైనది అని ఆక్షేపించారు. అంతేకాదు.. ఉగ్రవాదానికి మేం మద్దతిస్తున్నాం, ప్రోత్సహిస్తున్నామంటూ బహిరంగంగా అంగీకరించడమేని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాక్ ఉప ప్రధానికి వ్యతిరేకంగా కనేరియా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.

పాక్‌ ప్రధానిపై కనేరియా నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్నారని వ్యాఖ్యానించారు. పెహల్‌గామ్‌ దాడిలో పాకిస్థాన్‌ ప్రమేయం లేకుంటే ప్రధాని షెషబాజ్‌ షరీఫ్‌ ఎందుకు ఖండించలేదు. ఈ ఘటనపై ఎందుకు మౌనంగా ఉన్నారు చెప్పాలన్నారు.

Also Read:లష్కరే తోయిబా అల్తాఫ్ లల్లి హతం!

- Advertisement -