దేశంలో కరోనా మరణ మృదంగం..

97
corona

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత 24 గంటల్లో మూడు లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదుకాగా 2,023 మంది మరణించారు. 24 గంటల్లో 2,95,041 కొవిడ్‌ కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 1,56,16,130కు చేరింది.

ఇప్పటి వరకు 1,32,76,039 మంది కరోనా నుండి కోలుకోగా 1,82,553 మంది ప్రాణాలు కొల్పోయారు. ప్రస్తుతం దేశంలో 21,57,538 యాక్టివ్‌ కేసులున్నాయి. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 13,01,19,310 టీకా డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.