గెలుపు గుర్రాలకే టికెట్లు….

269
errabelli
- Advertisement -

GWMC ఎన్నికల్లో టీఆరెఎస్ విజయమే లక్ష్యంగా పని చేయాలని, వందకు వంద శాతం ఫలితాలు టీఆరెఎస్ కు అనుకూలంగా ఉండే విధంగా చూడాలని ఈ ఎన్నికల సమన్వయ కమిటీకి నేతృత్వం వహిస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పార్టీ నేతలకు ఉద్బోధించారు. సమన్వయ కమిటీ సభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ హన్మకొండలోని కడియం శ్రీహరి ఇంటిలో GWMC ఎన్నికల పై, పశ్చిమ నియోజకవర్గం పరిస్థితులపై ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జి గ్యాదరి బాల మల్లు, మాజీ ఎంపీ గుండు సుధారాణి, ghmc మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్య మంత్రి తాటికొండ రాజయ్య తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, Gwmc టీఆరెఎస్ విజయం ఖాయం అన్నారు. గెలిచే అభ్యర్థులకే టిక్కెట్లు ఇచ్చామని, ఇక వారి గెలుపు లక్ష్యంగా పని చేయాలని పార్టీ నేతలకు, శ్రేణులకు సూచించారు. అన్ని సర్వేలు టీఆరెఎస్ కు అనుకూలంగా ఉన్నాయన్నారు. బోగస్ మాటల బీజేపీ అడ్రస్ గల్లంతు చేయాలన్నారు. మిగతా ప్రతిపక్షాలకు gwmc లో ఉనికే లేదన్నారు. ఈ దశలో ప్రజలను అభివృద్ధి సంక్షేమం పై చైతన్యం చేయాలన్నారు. ఎప్పటికైనా తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టీఆరెఎస్ మాత్రమే రాష్ట్ర అభివృద్ధి కి, gwmc అభివృద్ధికి పాటు పడుతుందన్నారు. ఆ విషయం ప్రజలకు బాగా అర్థం అయిందన్నారు. మొన్న మంత్రి కేటీఆర్ 2వేల 500 కోట్లతో చేసిన అభివృద్ధి పథకాలకు చేసిన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చూసి ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగిందని చెప్పారు. అయితే, ఈ gwmc ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని మంత్రి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు

- Advertisement -