కొత్తగా 2,901 కరోనా కేసులు..

218
ap corona

ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 74,757 కరోనా టెస్టులు చేయగా, 2,901 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 555 కేసులు రాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 55 కేసులు వచ్చాయి. అదే సమయంలో రాష్ట్రంలో 19 మంది కరోనాతో మృతి చెందారు. 4,352 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.

ఇక ఏపీలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,11,825కి చేరింది. ఇప్పటివరకు 7,77,900 మంది వైరస్ ప్రభావం నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 27,300 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. అటు, మొత్తం మరణాల సంఖ్య 6,625కి పెరిగింది.