ఏపీలో కొత్తగా 1,246 కరోనా కేసులు నమోదు..

37

ఆంధ్రపదేశ్‌లో గత 24 గంటల్లో 55,323 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 1,246 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 207 కేసులు నమోదవగా, అత్యల్పంగా అనంతపురం, కర్నూలు, విజయనగరం జిల్లాలలో 13 కేసుల చొప్పున నమోదయ్యాయి.

ఇక మొత్తం 1,450 మంది కరోనా నుంచి కోలుకోగా… 10 మంది మహమ్మారి వల్ల మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,44,490కి చేరుకుంది. మొత్తం 20,16,837 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 14,118 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,535 యాక్టివ్ కేసులు ఉన్నాయి.